Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్‌లైట్ ఏరియా మహిళను చెప్పులతో కొట్టి.. నగ్నంగా ఊరేగించారు.. ఎందుకంటే?

ఆటవిక చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా బీహార్ రాష్ట్రం మారుతోంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓ యువకుడు అనుమానాస్పదంగా రైలు పట్టాల పక్కన చనిపోయాడు.

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:28 IST)
ఆటవిక చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా బీహార్ రాష్ట్రం మారుతోంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓ యువకుడు అనుమానాస్పదంగా రైలు పట్టాల పక్కన చనిపోయాడు. ఆ యువకుడి మృతికి స్థానికంగా ఉండే రెడ్‌లైట్ ఏరియాలో నివశించే ఓ మహిళ కారమణని భావించిన కొందరు... ఆ మహిళను జుట్టుపట్టుకుని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి.. చెప్పుతో కొట్టి నగ్నంగా చేసి ఊరేగించారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలోని దామోదర్‌పూర్‌లో జరిగింది.
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దామోదర్‌పూర్‌ గ్రామానికి చెందిన విమలేశ్ షా(19) అనే యువకుడు ఆదివారం అదృశమయ్యాడు. ఆ తర్వాత సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద విమలేశ్ షా మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహించిన దామోదర్‌పూర్ గ్రామస్తులు.. రైల్వేట్రాక్ పక్కనే ఉన్న రెడ్‌లైట్ ఏరియాపై దాడి చేశారు. అక్కడున్న ఉన్న షాపులను ధ్వంసం చేసి.. వాహనాలను తగులబెట్టారు. 
 
విమలేశ్ చావుకు రెడ్‌లైట్ ఏరియాలో ఉండే ఓ మహిళ కారమణని సందేహించారు. దీంతో ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా చితకబాదారు. నగ్నంగా ఊరేగించారు. చెప్పులతో దారుణంగా కొట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం