మానసిక ఆరోగ్యం ఉందనీ ముగ్గురు పిల్లల తల్లిని మరుగుదొడ్డిలో బంధించిన భర్త!!

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (14:31 IST)
కట్టుకున్న భార్య మానసిక రోగంతో బాధడుతుందని ఒక యేడాది పాటు మరుగుదొడ్డిలో భర్త బంధించాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా, రిష్పూర్ అనే గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 35 యేళ్ళ ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు, భర్త ఉన్నాడు. అయితే, తన భార్య మానసిక రోగంతో బాధపడుతుందని పేర్కొంటూ ఒక యేడాది పాటు మరుగుదొడ్డిలో బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న మరుగుదొడ్డిలో బలహీనంగా ఉన్న మహిళను అధికారులు కాపాడి సివిల్ ఆసుపత్రికి తరలించారు. 
 
దీనిపై మహిళా రక్షణ అధికారి రజనీగుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్డిలో దయనీయమైన పరిస్థితుల్లో పడుకున్న మహిళను అధికారులు కాపాడారు. బాధిత మహిళ బలహీనంగా ఉందని, నడవలేకపోయిందని, ఆమెకు ఆహారం ఇచ్చామని గుప్తా చెప్పారు. 
 
బందీఖానాలో బాధత మహిళకు సరైన ఆహారం, తాగునీరు కూడా ఇవ్వలేదని అధికారులు చెప్పారు. బాధిత మహిళకు 17 సంవత్సరాల క్రితం నరేష్ కుమార్‌తో వివాహం అయిందని, వారికి 15, 11, 13 సంవత్సరాల వయసు గల పిల్లలున్నారని అధికారులు చెప్పారు. 
 
తన భార్యకు మానసిక ఆరోగ్య సమస్య ఉందని భర్త నరేష్ కుమార్ చెబుతున్నా, బాధితురాలు కుటుంబ సభ్యులందరినీ గుర్తించారని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని అధికారులు చెప్పారు. భార్యను బంధించిన భర్త నరేష్ కుమార్‌పై ఐపీసీసెక్షన్ 498ఏ, 342 కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారి సురేందర్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments