Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగానే చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని పీక కోసిన దుండగులు... పోలీసుల వేట...

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి దారుణంగా హత్య చేసిన వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ప్రధాన కూడళ్లన్నింటిలోనూ జల్లెడ పడుతున్నారు. కాగా ఈ ఘటన నగరంలో పెను సంచలనం సృష్టించిం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (15:48 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి దారుణంగా హత్య చేసిన వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ప్రధాన కూడళ్లన్నింటిలోనూ జల్లెడ పడుతున్నారు. కాగా ఈ ఘటన నగరంలో పెను సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారమే ఆ యువతి హత్యకు కారణమని పోలీసుల భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే స్వాతి (25) అనే ఓ యువతి  కార్యాలయానికి వెళ్లేందుకుగాను రైల్వే స్టేషన్‌కు శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో చేరుకుంది. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను గుర్తుతెలియని దుండగులు కత్తితో పీక కోసి పారిపోయారు. 
 
చెంగల్పట్టులోని ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే స్వాతిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేసి పారిపోయారని.. ఈ విషయం తెలుసుకుని సంఘటనా ప్రాంతానికి పోలీసులు వచ్చేలోపే తీవ్ర రక్తస్రావమైన స్వాతి ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. స్వాతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. హత్యకు గురైన స్వాతి బ్యాగు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని.. చివరిగా స్వాతి తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. స్వాతితో చివరిగా మాట్లాడిన ప్రియుడి వద్ద  విచారణ జరుపుతున్నారు. స్వాతి హత్య నేపథ్యంలో రైల్వే స్టేషన్లో భద్రతను పెంచారు. మహిళా రక్షణ కోసం రైల్వే స్టేషన్ల భద్రత కరువైందని మహిళా ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా నుంగంబాక్కం రైల్వే స్టేషన్ సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోవడం ఈ హత్య చేసేందుకు దుండగులకు అనుకూలంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments