Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేస్తుంటే ప్రతిఘటించలేదేం...? జర్మనీ మోడల్‌కు 27 వేల డాలర్ల జరిమానా విధించిన కోర్టు

అత్యాచారానికి గురైన జర్మనీ మోడల్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన ప్రమేయం లేకుండా తనపై జరిగిన అత్యాచారానికి జర్మనీ న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు శిక్ష విధించాల్సిన

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (15:43 IST)
అత్యాచారానికి గురైన జర్మనీ మోడల్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన ప్రమేయం లేకుండా తనపై జరిగిన అత్యాచారానికి జర్మనీ న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు శిక్ష విధించాల్సిన కోర్టు బాధితురాలికి 27 వేల డాలర్లను జరిమానాగా విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు విధించిన తీర్పుపై జర్మన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... 29 ఏళ్ల జర్మన్ మోడల్ గినా-లిసా లోఫింక్‌ మద్యం మత్తులో డ్రగ్స్ తీసుకోగా ఆమెను ఇద్దరు యువకులు రేప్ చేసి వారి వద్ద ఉన్న కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం గురించి గినా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులతో సహా ఆమెను కూడా కోర్టులో హాజరుపరిచారు. 
 
కోర్టులో ప్రధాన సాక్ష్యంగా నిలిచిన వీడియోని పరిశీలించిన న్యాయమూర్తి... రేప్ జరిగిన సమయంలో బాధితురాలు సెక్స్‌ను అడ్డుకోలేదనే కారణంతో ఆమెను దోషిగా నిర్థారించారు. అంతేకాదు ఆమెకు 27 వేల డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మోడల్ గినా-లిసా లోఫింక్‌ తన ఆవేదన వ్యక్తం చేసింది. తనపై అత్యాచారం జరిపిన వాళ్లని శిక్షించకుండా తననే దోషిగా పరిగణించినందుకు వాపోయింది. 
 
అంతేకాదు ఆసమయంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని, ఏం జరుగుతుందో తనకు తెలియలేదని... ఆ సమయంలో కామాంధుల ఆగడాలను అడ్డుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. అయితే జర్మనీలో మహిళలపై అత్యాచారాలు చేసి నిందితులు తప్పించుకోవడం ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. శారీరకంగా తనపై దాడి జరిగినట్లు బాధితురాలు నిరూపించుకోగలిగితేనే దాన్ని రేప్ అంటామని.. లేకపోతే అది అంగీకారంతో కూడిన శృంగారమే అవుతుందని ప్రస్తుత చట్టం ప్రకారం కోర్టులు చెబుతున్నాయి. దాంతో ఆ కేసును కోర్టు కొట్టేసింది.. ఇలాంటి చట్టాలను మార్చాలని జర్మన్ మహిళలు ఉద్యమిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం