Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాన్స్‌కు నిరాకరించిందని.. కొడవలితో నరికి చంపేసిన ప్రియుడు..

రొమాన్స్‌కు నిరాకరించిందని తన ప్రియురాలిని ఓ దుండగుడు దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని నెల్లైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నెల్లై జిల్లాలోని ఓ హాస్టల్‌లో ఆనంది (38) పనిచేస్తోం

Webdunia
బుధవారం, 5 జులై 2017 (16:56 IST)
రొమాన్స్‌కు నిరాకరించిందని తన ప్రియురాలిని ఓ దుండగుడు దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని నెల్లైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నెల్లై జిల్లాలోని ఓ హాస్టల్‌లో ఆనంది (38) పనిచేస్తోంది. ఈమె దారుణంగా హత్యకు గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
భర్తను కోల్పోయిన ఆనంది.. తన ఇద్దరు కుమారులతో అదే హాస్టల్‌లో బసచేసి పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ముక్కూడల్ ప్రాంతంలోని సింగం పారైకి చెందిన సెల్లప్ప (50)తో ఆనందికి వివాహేతర సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ రహస్యంగా కలుసుకోవడం చేసేవారని... కానీ హాస్టల్‌కు వెళ్ళిపోయాక ఆనంది సెల్లప్పతో సంబంధాలను తెంచుకుందని తెలిసింది.
 
అయితే హాస్టల్ వద్దకు వెళ్ళిన సెల్లప్ప ఆనందిని రొమాన్స్ కోసం ఒత్తిడి చేశాడు. అయితే ఆనంది అందుకు అంగీకరించలేదు. హాస్టల్‌లో ఇవన్నీ కూడదని ఆనంది చెప్పినా సెల్లప్ప వినలేదు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన సెల్లప్ప... అక్కడే వున్న కొడవలితో ఆనందిపై దాడి చేశాడు. ఆపై అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆనంది.. ప్రాణాలు కోల్పోయింది. పరారిలో ఉన్న సెల్లప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులో తానే ఆనందిని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments