Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యాన్ని మట్టుబెట్టే శక్తి మాకుందన్న చైనా మీడియా.. బర్రెలు, గొర్రెలు తోలిన వాజ్‌పేయ్!

సిక్కిం ప్రాంతంలోనికి ప్రవేశించిన భారత సైనిక దళాలను మట్టుబెట్టే శక్తి తమ సైన్యానికి ఉందని చైనా పత్రిక ఊటంకించింది. భారత్‌కు ఈశాన్య ప్రాంతమైన సిక్కిం సరిహద్దు ప్రాంతానికి చైనా సైనిక దళాలు హద్దులు మీరు

Webdunia
బుధవారం, 5 జులై 2017 (16:33 IST)
సిక్కిం ప్రాంతంలోనికి ప్రవేశించిన భారత సైనిక దళాలను మట్టుబెట్టే శక్తి తమ సైన్యానికి ఉందని చైనా పత్రిక ఊటంకించింది. భారత్‌కు ఈశాన్య ప్రాంతమైన సిక్కిం సరిహద్దు ప్రాంతానికి చైనా సైనిక దళాలు హద్దులు మీరు ప్రవేశించాయని భారత సైన్యం కొన్ని రోజులకు ముందు విమర్శించిన సంగతి తెలిసిందే. కానీ దీన్ని చైనా ఖండించింది. భారత సైనికులే తమ సరిహద్దులోనికి ప్రవేశించారని.. చాలాకాలం పాటు సిక్కిం ప్రాంతాన్ని ఆక్రమించాలనుకుంటున్న చైనా వెల్లడించింది.
 
ఈ నేపథ్యంలో భారత్-చైనా సైనిక దళాలను సరిహద్దు ప్రాంతంలో మోహరించాయి. అయితే చైనా పత్రికలు మాత్రం భారత్ చర్యలను ఎద్దేవా చేస్తూ రాతలు రాస్తున్నాయి. విమర్శలు చేస్తున్నాయి. తాజాగా భారత సైనిక దళాలను మట్టుబెట్టే శక్తి చైనా సైనిక దళాలకు వుందని చైనా పత్రికలు ఊటంకిస్తున్నాయి. ఇంకా సిక్కిం నుంచి భారత సైన్యం తిరిగి వెళ్ళిపోవాలని.. లేకుంటే తరిమికొట్టడం ఖాయమని పత్రికలు హెచ్చరిస్తున్నాయి.  
 
ఇదిలా ఉంటే సిక్కిం సరిహద్దులో మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కాలంలో 1965లో ఓ ఘటన చోటుచేసుకుంది. సిక్కిం సరిహద్దు వద్ద తమ దేశానికి చెందిన వ్యక్తులకు చెందిన 800 గొర్రెలు, 59 జడలబర్రెలను భారత సైనికులు దొంగిలించారని ఆరోపిస్తూ అప్పట్లో చైనా ఓవరాక్షన్ చేసింది. ఈ ఘటన అప్పట్లో ఇరు దేశాల మధ్య లేఖల యుద్ధానికి దారితీసింది. తమ బర్రెలను, గొర్రెలను తిరిగి ఇచ్చేయాలని అప్పట్లో చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 
 
చైనా తీరుతో చిర్రెత్తుకొచ్చి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అప్పట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వాజపేయ్..  ఢిల్లీలోని చైనా ఎంబసీలోకి గొర్రెల మందను తోలారు. మరోవైపు వాజ్ పేయి గొర్రెల నిరసనతో చైనా షాక్‌కు గురైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments