Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియలకు డబ్బుల్లేక.. బిడ్డ మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి...

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో. నవమాసాలు మోసి ఓ శిశువుకు జన్మనిచ్చింది. కానీ, ఆ తల్లి సంతోషం ఎన్నోరోజులు నిలువలేదు. పుట్టిన కొద్ది రోజుల్లోనే గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూసింది.

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (10:34 IST)
ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో. నవమాసాలు మోసి ఓ శిశువుకు జన్మనిచ్చింది. కానీ, ఆ తల్లి సంతోషం ఎన్నోరోజులు నిలువలేదు. పుట్టిన కొద్ది రోజుల్లోనే గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూసింది. ఆ బాధను పంటిబిగువున దిగమింగుకుంది. కానీ, కనీసం బిడ్డ అంత్యక్రియలైనా నిర్వహిద్దామని భావించింది. చీరకొంగు ముడిని విప్పి చూస్తే పైసా లేదు. ఏంచేయాలో తెలియక.. ఆ తల్లి కన్నబిడ్డ మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయింది. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి.. ఎవరూ చూడకుండా చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయింది.
 
ఈ విషాదకర సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారోలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బొకారో జిల్లాలోని ధన్‌బాద్‌కు చెందిన డాలీ అనే మహిళ గత నెల 30న జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అక్టోబరు ఒకటో తేదీన శిశువుకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. చికిత్సకు రోజుకు రూ.8 వేలు వసూలు చేస్తుండటంతో ఆమెకు శక్తికి మించిన భారంగా మారింది. దీంతో అనారోగ్యంగా ఉన్న శిశువును ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లుతుండగా మార్గమధ్యంలో చనిపోయింది. 
 
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక కన్న బిడ్డను ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసింది. రోడ్డుపై శిశువు ఉన్న కవర్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శిశువు మృతదేహం ఉన్న చోటుకుచేరుకున్న పోలీసులు కవర్‌పై ఉన్న ఆస్పత్రి లోగో ఆధారంగా వివరాలు సేకరించి డాలీని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు డబ్బులేని కారణంగానే మరణించిన బిడ్డను అలా రోడ్డు పక్కన పడేశానని డాలీ తెలిపింది. ఇప్పటికే కాన్పు ఖర్చుల కోసం అప్పులు చేయాల్సివచ్చిందని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు కూడా ఏం చేయాలో తోచక ఆమెను మందలించి వదిలివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments