Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు వేరొక మహిళతో అక్రమ సంబంధం.. పెళ్లైన 4 నెలల్లో ఆత్మహత్య.. పుట్టింటికి వచ్చి?

పెళ్లికి ముందు నుంచే తన భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండటాన్ని ఆతడి భార్య జీర్ణించుకోలేకపోయింది. నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకుని.. భర్త పేరును చేతిపై రాసుకుంది. కానీ భర్త మాత్రం వేరొక

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (11:08 IST)
పెళ్లికి ముందు నుంచే తన భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండటాన్ని ఆతడి భార్య జీర్ణించుకోలేకపోయింది. నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకుని.. భర్త పేరును చేతిపై రాసుకుంది. కానీ భర్త మాత్రం వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. పుట్టింటికి వచ్చిన తన భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన సదరు మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్వేత అనే 25ఏళ్ల యువతి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో నివ‌సిస్తుండేది. ఆమె తండ్రి అవ‌ధేష్ శ్రీ‌వాస్త‌వ ఓ షాపింగ్‌మాల్‌లో ఉద్యోగి. ఇతడు శ్వేతకు ఉన్న‌వ్‌కు చెందిన విజ‌య్ ఆలియాస్ మోనూతో వివాహం జరిపించాడు. ఏప్రిల్ 23న వీరి వివాహం జరిగింది. కానీ పెళ్లికి ముందే భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసీ శ్వేత ఆవేదనకు గురైంది. 
 
తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేసింది. వారు అతడిని మందలించినా అతడిలో మార్పు రాలేదు. ఓ శుభకార్యం ఉండ‌టంతో 15 రోజుల కింద‌ట శ్వేత కాన్పూర్‌లో పుట్టింటికి వ‌చ్చింది. ఆమె పుట్టింటికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ విజ‌య్.. ఒక్క‌రోజు కూడా ఫోన్ చేయ‌లేద‌ట‌. త‌న‌ను తీసుకెళ్ల‌డానికి వ‌స్తాడ‌ని ఆశించిన ఆమెకు నిరాశే ఎదురైంది. దీనితో ఆమె తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి తన గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments