శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

సెల్వి
బుధవారం, 19 నవంబరు 2025 (10:05 IST)
లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మాల ధరించి శబరిమలకు చేరుకుంటున్నారు. శబరిమలలో భారీ రద్దీ నెలకొంది. ఈ కారణంగా ఒక మహిళా భక్తురాలు స్పృహ కోల్పోయి మృతి చెందింది. మృతురాలు కోజికోడ్ జిల్లాలోని కోయిలాండికి చెందినవారని గుర్తించారు. 
 
భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం 10 గంటలకు పెరిగింది. పవిత్ర మెట్ల దగ్గర రద్దీ ఏర్పడింది. పోలీసులు జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. జనసమూహం కారణంగా చాలా మంది పిల్లలు మరియు వృద్ధులు అసౌకర్యానికి గురయ్యారు. 
 
ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 మంది భక్తులను, డైరెక్ట్ బుకింగ్ ద్వారా 20,000 మందిని మాత్రమే అనుమతిస్తున్నప్పటికీ, మంగళవారం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో మహిళా భక్తురాలు స్పృహ కోల్పోయి మరణించింది. 
 
మృతురాలి మృతదేహాన్ని దేవస్వం బోర్డు ఖర్చుతో అంబులెన్స్‌లో ఆమె స్వగ్రామానికి తీసుకెళ్తారు. ఇకపోతే.. శబరిమలలో సరైన సౌకర్యాలు లేకపోవడంపై విస్తృత విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments