Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్ మిస్... క్యాబ్ డ్రైవర్‌ను ఉరికించి.. ఉరికించి కొట్టిన మహిళ (Video)

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (09:51 IST)
దేశ వాణిజ్యరాజధాని ముంబై మహానగరంలో ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఓ యువతి అమానుషంగా దాడి చేసింది. క్యాబ్ విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఆ యువతి ప్రయాణించాల్సిన ఫ్లైట్ మిస్సైంది. దీంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విమానాశ్రయం బయటే క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకుని చితక్కొట్టింది. డ్రైవర్ వల్లే తన ఫ్లైట్ మిస్ అయ్యిందని ఆరోపిస్తూ ఉరికించి కొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ముంబై నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. 
 
ఈ రహదారులపై వాహనాన్ని వేగంగా నడపడం ఎంతో కష్టం. అందుకే క్యాబ్ డ్రైవర్ నిర్ణీత సమయంలోగా ఎయిర పోర్టుకు చేరుకోలేకపోయారు. ఈ కారణంగా ఆ యువతి ప్రయాణించాల్సిన విమానం మిస్సైంది. దీంతో ఆ యువతికి పట్టరాని కోపంతో క్యాబ్ డ్రైవర్‌పై దాడికి దిగింది. దీనిపై బాధితుడు సమీప పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments