Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చివాగుడు వాగితే గుడ్లు - నాలుక పీకేస్తాం : కేంద్ర మంత్రి షెకావత్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (14:55 IST)
సనాతన ధర్మాన్ని దూషించేవారికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గట్టి హెచ్చరిక చేశారు. పిచ్చివాగుడు వాగితే గుడ్లు, నాలుకు పీకేస్తామన్నారు. సనాతన ధర్మంపై విమర్శలు చేసేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీ, ఎయిడ్స్ వంటి వాటితో పోల్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ పిలుపునిచ్చారు. 
 
ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, మన పూర్వీకులు వారి జీవితాలను ఫణంగా పెట్టి కాపాడిన సనాతన ధర్మాన్ని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించబోము. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుకలు, కనిగుడ్లు పీకేస్తాం. దీనిపట్ల అలక్ష్యంగా చూసే వారి కళ్లను పీకేస్తాం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి రాజకీయ శక్తిని చాటలేరు అని అన్నారు. 
 
తాను నమ్మే దేవుడిని - తన అత్మవిశ్వాసాన్ని తిట్టొద్దు.. రష్మి హచ్చరిక  
 
తాను నమ్మే దేవుడిని, తన ఆత్మవిశ్వాసాన్ని తిట్టొద్దని బుల్లితెర యాంకర్, హీరోయిన్ రష్మి గౌతమ్ హెచ్చరించారు. సనాతన ధర్మానికి మద్దతుగా గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. దీంతో ఆమెను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆమె స్పందించారు. నాస్తికులను తాను గౌరవిస్తున్నప్పుడు, తాను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నానని చెబితే ఎందుకు విమర్శిస్తున్నారంటూ ప్రశ్నించారు. తనకు ఎదురైన విషయాలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
"నేను ఈ ఒక్క పోస్ట్‌ను షేర్ చేయగానే నన్ను అంతా టార్గెట్ చేసుకున్నారు. తమకు వాక్ స్వాతంత్ర్యం ఉందంటూ చాలా మంది దీనిపై వాదిస్తున్నారు. కానీ, నేను నమ్ముతున్న ధర్మం వైపు ఉంటానని చెప్పినందుకు నేను విమర్శలు ఎదుర్కోవాలా? సిగ్గుపడాలా? నేను మీ నాస్తికత్వాన్ని ప్రశ్నించడం లేదు. అలాంటపుడు నా విశ్వాసాలను మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు. కొందరు కులాల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అసలు ఏ మతం సరైనదో చెప్పండి. తీవ్రవాదులు, అతివాదులు లేని మతం ఏదో చెప్పండి. కేవలం మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, ఆ కుటుంబాన్ని మార్చుకోలేరు కదా. అన్ని మతాలకు మూల సూత్రం ఒకటే ఉంది. అదే బ్రతకండి. బ్రతనివ్వండి. అంతే తప్ప నా దేవుడిని నా విశ్వాసాన్ని తిట్టొద్దు అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments