Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీని కౌగలించుకుంటానంటున్న బీజేపీ నేత!!

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (21:13 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దేశంలోని మహిళా ఫైర్‌బ్రాండ్లలో ఒకరు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారును ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో ధైర్యంగా నిలదీస్తున్న మహిళా నేత. అలాంటి మహిళను ఓ బీజేపీ నేత నేరుగా వెళ్లి కౌగలించుకుంటానని ప్రకటించారు. ఆయన పేరు అనుపమ్ హజ్రా. ఇటీవలే బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించగా, ఆయన జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగలించుకుంటానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుతో ఆయనపై సిలిగిరి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
కాగా, ఇంతకీ ఆయన అలా ఎందుకు మాట్లాడారో ఓసారి పరిశీలిస్తే, కరోనా వ్యాప్తి మొదలయ్యాక పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిస్తోందని ఆరోపించారు. "నాకు కూడా ఏదో ఒక సమయంలో కరోనా సోకుతుంది. అప్పుడు నేరుగా వెళ్లి మమతా బెనర్జీని కౌగిలించుకుంటా. అప్పుడు ఆమెకు కూడా కరోనా వస్తుంది. అప్పుడు కానీ ప్రజలు పడుతున్న కష్టమేంటో ఆమెకు అర్థం కాదు. తమ వారిని కోల్పోయిన ప్రజల ఆవేదన అప్పటికిగాని ఆమెకు తెలిసిరాదు" అంటూ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments