Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం చేసుకున్న యువకుడి నుంచి వాట్సప్ కాల్, అంతే... గొంతు నులిమేసాడు

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (22:34 IST)
ఇద్దరి మనసులు కలిశాయి. దాంతో విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండానే యువతిని పెళ్లి చేసుకున్నాడతను. పైగా ఆమెను గోప్యంగా వేరేచోటకి తరలించి కాపురం చేసాడు. అలా మూడు నెలలు గడిచింది. ఓ రోజు ఆమెకి వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ కాల్ చూసి ఆగ్రహం చెంది ప్రేమించి పెళ్లాడిన భార్య గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా వెళ్లి పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిధిలో నివాసం వుంటున్న అన్షుకి లాక్ డౌన్ సమయంలో సచిన్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఐతే కుటుంబ సమస్యల కారణంగా ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత అన్షు మరో యువకుడు హర్షతో ప్రేమలో పడింది. వీళ్లద్దరూ ఒకే చోట పనిచేసేవారు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
 
దాంతో ఆమె మెడలో మూడుముళ్లు వేసి మూడు నెలల క్రితం కలిసి జీవించడం ప్రారంభించారు. ఎవరికీ చెప్పకుండా ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అన్షు తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా అతడితో సంతోషంగా జీవించడానికి వచ్చేసింది. తమ కుమార్తె అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి తప్పిపోయిందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేసారు.
 
ఆమె ఆచూకి తెలుసుకునేలోపే అక్టోబరు 27 రాత్రి హర్ష తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య అన్షును గొంతు నులిమి హతమార్చడం సంచలనంగా మారింది. తన భార్యను తనే హత్య చేసానంటూ అతడు పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. కాగా తమ కుమార్తె మరణవార్త విని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. హర్ష ఓ రాజకీయ నాయకుడి మద్దతు వున్నట్లు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments