Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య....

ప్రియుడితో కలిసి భర్తను ఓ భార్య కడతేర్చింది. ఆ తర్వాత భార్య కూడా హత్యకు గురైంది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కాంచీపురం జిల్లా కల్పాక్కం సమీపంలో

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (14:11 IST)
ప్రియుడితో కలిసి భర్తను ఓ భార్య కడతేర్చింది. ఆ తర్వాత భార్య కూడా హత్యకు గురైంది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కాంచీపురం జిల్లా కల్పాక్కం సమీపంలో గల ఆయపాక్కం గ్రామానికి చెందిన సెల్వం (30) అనే ఆటోడ్రైవర్‌కు భార్య చంద్రమతి (27), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటికి సెల్వం స్నేహితుడు ఆనందన్ (35) అనే వ్యక్తి తరచూ వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో చంద్రమతికి ఆనందన్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన సెల్వం.. భార్యను మందలించాడు.
 
అయితే, ఆనందన్‌కు పడక సుఖం కోసం ఆశపడిన చంద్రబాబు.. భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందులోభాగంగా, ప్రియుడితో కలిసి మార్చి 11వ తేదీన హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని గ్రామంలోగల వంతెన కింద పడేసింది. స్థానికులు సెల్వం హత్యకు గురైన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సెల్వం ఇంటికి అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు ఆనందన్‌ (35) తరచూ వచ్చి వెళుతున్నట్టు చెప్పారు. దీంతో చంద్రమతిని, ఆనందన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. ఆనందన్‌ సహచరులు సురేష్‌ (30), శ్రీధర్‌ (30), కార్తీక్‌ (22), ప్రకాష్‌ (20) కలిసి హత్య చేసినట్టు అంగీకరించారు. 
 
ఆ తర్వాత చంద్రమతి, ఆనందన్‌ సురేష్‌ శ్రీధర్, ప్రకాష్‌లను పోలీసులు అరెస్టు చేసి జైలులో నిర్భంధించారు. ఇలావుండగా, చంద్రమతి నెల రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైంది. ఈ విషయం తెలుసుకున్న సెల్వం బంధువులు చంద్రమతిపై మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments