Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లగా ఉన్నాడంటూ భర్తను వేధించడం క్రూరత్వమే : కర్నాటక హైకోర్టు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (09:11 IST)
నల్లగా ఉన్న భర్తను కట్టుకున్న భార్య పదేపదే అవమానించసాగింది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినపుడల్లా నల్లగా ఉన్నావంటూ వేధిస్తూ వచ్చేది. ఈ వేధింపులను భరించలేని భర్త కోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత భర్తపై భార్య గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఆమె చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొంటూ విడాకులు మంజురూ చేసింది. కర్నాటక హైకోర్టు తాజాగా వెల్లడించిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటకకు చెందిన ఓ జంటకు గత 2007లో వివాహమైంది. ప్రస్తుతం అతని వయసు 44 సంవత్సరాలు కాగా, ఆమె వయసు 41 యేళ్లు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత వారిమధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చీటికి మాటికి భర్తను చీదరించుకోవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా, నల్లగా ఉన్నావంటూ పదేపదే తిట్టేది. 
 
దీంతో విసుగు చెందిన ఆయన విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో భర్తతో పాటు అత్త మామలపై కూడా భార్య గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించింది. దీంతో కింది కోర్టు ఆ వ్యక్తి దాఖలు చేసుకున్న విడాకుల పిటీషన్‌ను తోసిపుచ్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. భర్తపై చేసిన భార్య చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది. పైగా, నల్లగా ఉన్నాడంటూ భర్తను అవమానించడం క్రూరత్వమేనని కోర్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments