Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొటాషియం సైనైడు తో ఎందుకు చనిపోతారు?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (08:13 IST)
పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హీమోగ్లోబిన్‌లో ఉండే ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్‌ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు.

నిజానికి పొటాషియం సైనైడుకు, హీమోగ్లోబిన్‌కు మధ్య రసాయనిక ప్రక్రియ ఏమీ లేదు. నోటిలో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది. వెంటనే పొటాషియం, సైనైడు అయాన్లుగా విడివడుతుంది. 
 
ఇది కణాల్లో ఉండే 'సైటోక్రోమ్‌-సి-ఆక్సిడేజ్‌' అనే ఎంజైముతో బంధించుకుంటుంది. ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్‌ నుంచి ఎలక్ట్రాన్లను గైకొని, వాటిని శ్వాసద్వారా వచ్చే ఆక్సిజన్‌కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధాన కర్త.

అయితే సైనైడు అయానులో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాంతో కణాల్లోని ఆక్సిజన్‌, గ్లూకోజ్‌ పరస్పరం వృథా అయిపోతాయి. ఫలితంగా కణాలకు శక్తి అందదు. శక్తిలేని కణాలు చేష్టలుడిగిపోవడం వల్ల మరణం త్వరగా వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments