Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైళ్లకు మరో ప్రమాదం.. 5 గంటలు ఆగిన రైలు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (10:45 IST)
భారతీయ రైల్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటికిమొన్న గాంధీ నగర్ - ముంబై రైలు వరుసగా గురు, శుక్రవారాల్లో ప్రమాదాలకు గురైంది. తొలు రోజున గేదెలను ఢీకొనగా, మరుసటి రోజున గోవులను ఢీకొట్టింది. 
 
తాజాగా శనివారం ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. ఈ రైలు మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ సమీపాన రైల్లోని సీ8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్‌ మోటారులో బేరింగు పనిచేయలేదు. దీంతో చక్రాలు దెబ్బతిని మొరాయించాయి. 
 
క్షేత్ర సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించి రైల్వే ఆపరేషన్స్‌ కంట్రోల్‌ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో రైలును నియంత్రిత వేగంతో 20 కి.మీ. దూరంలో ఉన్న ఖుర్జా రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లి ఆపారు. అక్కడ 5 గంటలపాటు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 1,068 మంది ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోకి తరలించి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments