Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాదిలో కొడుకు కంపెనీ 16 వేల రెట్లు వృద్ధి... చిక్కుల్లో అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా చిక్కుల్లో పడ్డారు. ఈయన కుమారుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ గత యేడాది కాలంలో ఏకంగా 16 వేల రెట్లు వృద్ధి సాధించింది.

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (10:32 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా చిక్కుల్లో పడ్డారు. ఈయన కుమారుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ గత యేడాది కాలంలో ఏకంగా 16 వేల రెట్లు వృద్ధి సాధించింది. అంటే, పెద్ద నోట్లకు ముందు ఈ కంపెనీని మూసివేయడం జరిగింది. ఆ తర్వాత కంపెనీని తిరిగి ప్రారంభించారు. అటు పిమ్మటే ఈ కంపెనీ ఏకంగా 16 వేల రెట్లు వృద్ధిని సాధించినట్టు జయ్ షా ఆదాయపన్ను శాఖకు సమర్పించిన టాక్స్ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. 
 
అంటే.. నష్టాల్లో ఉన్న కంపెనీ ఆ తర్వాత రూ.80 కోట్ల మేరకు ఆదాయాన్ని అర్జించింది. దీనికి కారణం అమిత్ షా అని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న అమిత్‌షా తన కుమారుడు జయ్‌ షాకు మేలు చేకుర్చేలా వ్యవహరించారన్న ప్రచారం సాగుతోంది. 
 
జయ్‌షా వ్యాపారం ఓ యేడాది వ్యవధిలోనే 16 వేల రెట్లు పెరిగిందని "ది వైర్‌ న్యూస్‌" పోర్టల్‌ కీలక కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా, జయ్‌షా తన తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని కోట్లాది రూపాయల బ్యాంక్‌ రుణాన్ని అక్రమ మార్గాల్లో పొందారని ఈ కథనంలో పేర్కొనడం జరిగింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. జయ్‌ షా వ్యాపారాభివృద్ధి విధానమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని విపక్షాలు ప్రధాని మోడీని డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారం అమిత్ షా మెడకు చుట్టుకునేలా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments