Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో కోరాడ్-5!.. ఇందులో నిజమెంత?

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (08:48 IST)
చాలామందికి ముఖ్యంగా బాగా చదువుకున్న వారికి స్వాబ్ టెస్ట్ చేయించుకోకుండా సీటీ స్కాన్ చేయించుకొనేవారికి, కోరాడ్ 4,5 అంటే సర్రున వెన్నులో వణుకు వచ్చి కాళ్ళు చేతులాడక, మిడి మిడి జ్ఞానం ఉన్న ఇంకా కొందరినడిగి, ఏమి అర్ధంకాక, ఇంటర్నెట్లో వెతికి ఇంకా కన్ఫ్యూజ్ అయి, వేరే ఎవరినైనా డాక్టరు ను అడిగితే.. ఆ డాక్టరు నాకెందుకొచ్చిన కంప, ఎక్కడయినా ఒక ఆసుపత్రి లో చేరుపో అంటాడు. 
 
ఇక మొదలైతాది అసలు ఆట...బంధువులు, ఫ్రెండ్సును అడిగితే మాకు తెలిసిన వారు ఆడ చేరారు ఈడ చేరారు, చచ్చిపోయారు, డబ్బులకు గడ్డి తింటావా, అప్పోసప్పో చేసి చేరు, లేదా కంపెనీ కడుతుంది నీది పోయేదేముంది? ముందు చేరు చేరు అని భయాందోళనలు కలగచేస్తారు.
 
అంతే సంగతులు...
సీటీ స్కాన్ లో కోరాడ్-5 అంటే కాన్సర్ లో మాదిరి లాస్టు స్టేజి అని అర్థం కాదు. జస్టు ఊపిరితిత్తుల లో కొరోనా ఉంది అని అనుమానం అని అర్ధం. మీరుకావాలంటే ఆ రిపోర్టు కిందనే గ్రేడింగ్ ఉంటుంది చదువండి నిదానంగా, మాతప్పేంలేదు,,తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఖర్మ అని అర్థం వచ్చేలా ప్రతి రిపోర్టులో కూడా ఇస్తారు ఒక డిస్ క్లైమర్ లా ఉంటుంది.  ఊరికే పరిగెత్తి భయపడి ఆసుపత్రి లలో చేరకండి. స్వాబ్ టెస్ట్ చేసుకోండి. 300రూపాయల మందు లేసుకోండి.
 
కోరాడ్ 1,2,3 అంటే కోరోనాకు సంబందించిన గ్రేడింగ్ కానే కాదు, కోరోనా కు సంబంధం లేనే లేదు. ఇక మిగిలింది 4,5....4 అంటే ఒక ఊపిరితిత్తిలో చిన్న అనుమానం..5 అంటే రెండు ఊపిరితిత్తుల లో కొంచెము గ్రౌండ్ గ్లాస్, లక్షణాలు సంకేతాలున్నాయని ఇన్ఫ్లమేషన్ ఉందని అర్ధం. అన్ని వైరస్ జబ్బులలో ఇలా రావచ్చును.
 
కోరాడ్ 5 ఉన్నవారందరికీ కొరోనా పాజిటివ్ రాదు, పాజిటివ్ వచ్చినా సీరియస్ కారు. కోరాడు 5 ఉన్న అందరూ చనిపోరు,,80% బాగా అవుతారు. సీటీ స్కాన్ అంటే పెద్ద మెషిన్ కచ్చితంగా చెబుతాది స్వాబ్ టెస్ట్  ఉచితంగా వస్తుంది, ఫలితానికి ఒకరోజు పడుతుంది అని తనకలాడతారు, మంచి ఫలితం కావాలంటే కొంచం సమయం పట్టదా? అన్ని ఇప్పటికి ఇప్పుడే కావాలి ఇన్స్టెంటు నూడుల్సు మాగీలా అంటే అలాగే ఉంటుంది.
 
చాలామంది ఆఫీసర్లు, అధికారులు ఇలాగే ఊరికే భయపడి చెప్పినపుడు వినకుండా ఆసుపత్రి లలో చేరుతారు. చేరినాలనుంచి అనుమానంతో చచ్చిపోతుంటారు.
 
ముందే స్వాబ్ టెస్ట్ చేసుకోండి. అయినా వినకుండా సీటీ స్కాన్ చేసుకోంటే,,కోరాడ్ 5 అంటే భయపడకండి. ఇపుడు అయినా స్వాబ్ టెస్ట్ చేసుకోండి...లక్షణాలు ఉంటే 300 రూపాయల మందులు వాడుకోండి. ఒక పల్సుఆక్సీమీటరుతో శాచురేషన్ చూసుకోండి. 93% కంటే తక్కువగా ఉంటే 104 కు ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రి లలో చేరండి. 60% బెడ్లు ఖాళీగానే ఉన్నాయి. అప్పులపాలు కాకండి, డబ్బున్నవారు, రిఎంబర్స్మెంట్ కల వారు చెప్పేవి వినకండి.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రి లలో సౌకర్యాలు సూపర్ గా ఉన్నాయి. లక్షల మంది ఇప్పటికే బాగయ్యారు. అయినా దీనికి పెద్ద మందులు కూడా అవసరం లేదు. స్టీరాయిడ్సు, హెపారిన్, ఆక్సిజన్ అంతే. 1% మందికే వెంటిలేటరు.

భయపడకండి, అవగాహన కల్పించుకోండి. చెప్పుడు మాటలు వినకండి, వదంతులు నమ్మకండి. సురక్షితంగా ఉండండి, అప్పులపాలు కాకండి. ఆత్మహత్యలు చేసుకోకండి, మాస్కు, సోపు,శానిటైజర్, భౌతికదూరం పాటించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments