Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ ప్రభావంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

కోవిడ్ ప్రభావంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసా?
, శనివారం, 3 అక్టోబరు 2020 (08:24 IST)
ప్రారంభ దశ నుండి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల్లో కొంత తగ్గుదల కనిపిస్తోంది. కోవిడ్ మహమ్మారి మన దేశంలో ప్రవేశించి 6 నెలలు దాటిపోయింది. ప్రస్తుతం దాని ప్రభావం కూడా తగ్గినట్టు కనిపిస్తోంది. దీంతో గతంలో కోవిడ్ సోకిన వారితో పోలిస్తే ఇప్పుడు కోవిడ్ వచ్చినవారు సులభంగా కోలుకుంటున్నారు.

ఇప్పుడు వైద్యులు మరియు శాస్త్రవేత్తలు కోవిడ్ -19 గురించి, అది మానవులపై చూపుతున్న ప్రభావంపై మరింత అవగాహన పెరిగింది. అందువల్ల 6 నెలల క్రితం కంటే ఇప్పుడు కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వైరస్ ప్రభావంపై ఇప్పుడు తెలిసినంతగా అప్పుడు (ఫిబ్రవరి 2020) తెలియని 5 ముఖ్యమైన విషయాల గురుంచి ఇప్పుడు తెలుసుకోవడం వల్ల వైద్య చికిత్స సులువవుతోంది.
 
1. కోవిడ్-19 మొదట న్యుమోనియా - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల మరణాలకు కారణమవుతుందని భావించారు. ఊపిరి పీల్చుకోలేని వారు, తీవ్ర అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చే వారు గాలి పీల్చుకోవడం కోసం సులువైన మార్గం వెంటిలేటర్లేనని భావించారు.

అయితే కోవిడ్ వైరస్ ఊపిరితిత్తులు మరియు శరీరంలోని ఇతర భాగాల్లోని రక్తనాళాలు గడ్డకట్టడానికి కారణమవుతుందని, దానివల్లే ఆక్సిజన్ శాతం తగ్గడానికి కారణమని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించడం ఒక్కటే సరిపోదని వైద్యులు గుర్తించారు. ఆక్సిజన్ అందించడంతోపాటు ఊపిరితిత్తులలోని సూక్ష్మమైన గడ్డలను కూడా కరిగించాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఆస్పిరిన్ మరియు హెపారిన్ (రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించేది) ఔషధాలను చికిత్సలో వినియోగిస్తున్నారు. 
   
2. కోవిడ్ కేసులు నమోదవుతున్న తొలి రోజుల్లో రోగుల్లో రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం ఆసుపత్రికి చేరేలోపు లేదా ఎక్కడపడితే అక్కడ (రోడ్ల మీద) చనిపోయేవారు. దీనికి ప్రధాన కారణం హ్యాపీ హైపోక్సియా. అయితే ఇప్పుడు కోవిడ్-19 రోగుల్లో ఆక్సిజన్ సంతృప్తస్థాయి అనేది తగ్గుతున్నప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదు.

మరికొన్ని సార్లు ఆక్సిజన్ లెవెల్స్ 70శాతానికి కూడా తగ్గుతున్నాయి. సాధారణంగా ఆక్సిజన్ లెవెల్స్ 90శాతం కంటే తక్కువగా ఉంటే మనం గాలి పీల్చుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఫిబ్రవరి 2020లో కోవిడ్ రోగులు ఈ గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవడమే కాకుండా ఆస్పత్రులకు చాలా ఆసల్యంగా చేరుకునేవారు.
 
అయితే ఇప్పుడు హ్యాపీ హైపోక్సియా గురించి వైద్యులు పూర్తిగా తెలుసుకోగలిగారు. కోవిడ్ పేషెంట్లలో ఆక్సిజన్ లెవెల్స్ ను సులువగా తెలుసుకునేందుకు పల్స్ ఆక్సీమీటర్ ను దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ 93శాతం లేదా అంతకంటే తక్కువకు పడిపోతే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచిస్తున్నారు. దీంతో రక్తంలో ఆక్సిజన్ లోపాన్ని సరిచేయడానికి వైద్యులకు ఎక్కువ సమయం దొరుకుతున్నందు వల్ల పేషెంట్లలో ఎక్కువ మంది సులువుగా కోలుకుంటున్నారు.
 
3. ఫిబ్రవరి 2020లో కోవిడ్ వైరస్‌తో పోరాడటానికి మన దగ్గర ఎలాంటి మందులు లేవు. వైరస్ వల్ల కలిగే సమస్యలకు మాత్రమే చికిత్స చేస్తూ వస్తున్నాం. అందువల్ల చాలా మంది రోగులు తీవ్రంగా వ్యాధి బారిన పడ్డారు. అయితే ఇప్పుడు మన దగ్గర కోవిడ్ చికిత్సకు 2 ముఖ్యమైన మందులు ఉన్నాయి. అవి 1) ఫావిపిరవీర్ 2) రెమెడిసివిర్ 
 
ఇవి కోవిడ్ వైరస్ ను చంపగల యాంటీ వైరల్స్. ఈ రెండు ఔషధాలను ఉపయోగించడం ద్వారా రోగులు తీవ్రంగా వ్యాధి బారిన పడకుండా నిరోధించవచ్చు. అందువల్ల వారు హైపోక్సియాకు వెళ్ళే ముందే వాటిని నయం చేయవచ్చు. ఈ విషయాన్ని వైద్యుులు ఫిబ్రవరి 2020 నాటికి తెలుసుకోలేదు. కోవిడ్ వైరస్ కు చికిత్స చేస్తున్నకొద్దీ అవగాహన పెరుగుగూ సెప్టెంబర్ 2020 తెలుసుకోగలిగారు.
 
4. రోగుల్లో చాలా మంది కోవిడ్ -19 వైరస్ కారణంగా మాత్రమే చనిపోవడం లేదు. వారిలో రోగ నిరోధకశక్తిని పెంపొందించే సైటోకిన్ స్టార్మ్ అధికంగా వెలువడడం వల్ల కూడా మరణిస్తున్నారు. ఈ సైటోకిన్ స్టార్మ్ బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ వైరస్ ను చంపడమే కాకుండా రోగులపై కూడా ప్రభావితం చేసి చనిపోయే పరిస్థితి రావొచ్చు. ఫిబ్రవరి 2020లో వైరస్ ను ఎలా నియంత్రించాలో వైద్యులు గుర్తించలేక పోయారు.

సెప్టెంబర్ 2020 నాటికి సైటోకిన్ స్టార్మ్ ను కంట్రోల్ చేయడానికి స్టెరాయిడ్స్ ను వినియోగించవచ్చని తెలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు ఈ స్టెరాయిడ్స్ ను దాదాపు 80 సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. కొంతమందిలో సైటోకిన్ స్టార్మ్ ను తగ్గించడానికి స్టెరాయిడ్స్ ను ఉపయోగించవచ్చని తెలిసింది.
   
5. హైపోక్సియా ఉన్నవారు బోర్లా పడుకోవడం ద్వారా సులువుగా కోలుకోగలుగుతారని కూడా వైద్యులు గుర్తించారు. ఇలా చేయడాన్ని *ప్రోన్ పొజిషన్ అని పిలుస్తారు. ఆల్ఫా డిఫెన్సిన్ అనే రసాయనం ఉత్పత్తి చేసిన తెల్లరక్త కణాలు ఊపిరితిత్తుల్లోని రక్త నాళాలలో గడ్డకట్టడానికి కారణమవుతాయని కొద్ది రోజుల క్రితం ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని నిరోధించేందుకు 'కొల్చిసిన్' అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు. దీన్ని మనం గౌట్ చికిత్సలో భాగంగా అనేక దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నాము.
 
కాబట్టి ఫిబ్రవరి నాటి కంటే సెప్టెంబరు 2020 నాటికి కోవిడ్-19 బారినపడివారు ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నారన్నది మనం ఖచ్చితంగా చెప్పగలము. మన దేశంలో మార్చి, ఏప్రిల్ నెలలో లాక్డౌన్ కారణంగా కేసుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకోలేదు. ఈ వ్యూహం కారణంగానే కోవిడ్ మహమ్మారి ప్రభావం 3 నెలలు వాయిదా పడింది. కేసుల సంఖ్య పెరగకపోవడం తద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడడానికి సహాయపడింది.  
 
కోవిడ్-19 గురించి భయపడాల్సిన అసవరం లేదు. ఎందుకంటే ప్రారంభ సమయంలో కోవిడ్ వచ్చిన వారికంటే ఇప్పుడు కోవిడ్ వైరస్ సోకిన వారు చాలా సులువుగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
  
అందరూ ఈ సాధారణ జాగ్రత్తలు పాటించండి:  
 
(1) 6 అడుగుల దూరం ఇతరుల నుండి
 
(2) ముఖానికి సరైన మస్కులు ధరించండి
 
(3) వీలైనప్పుడల్లా ఇంటి నుండి పని చేయండి
 
(4) ఆహారం, కిరాణా మరియు కూరగాయల ఇంటికే డెలివరీ చేసేలా ఆర్డర్ చేయండి
 
(5) లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉండండి
 
(6) చేతులను తరచూ శుభ్రం చేసుకోండి, పరిశుభ్రంగా ఉంచుకోండి
 
పైన చెప్పిన ప్రకారం కోవిడ్ మనదేశంలో ప్రవేశించినప్పటి పరిస్థితులకు ఇప్పటికీ వైద్య చికిత్సలో ఎంతో పురోగతి ఉంది. వైరస్ బారిన పడినప్పటికీ సులువుగా కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. అదే సమయంలో ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉంటోంది. కాబట్టి పైన సూచించిన ఆరు అంశాలను ప్రతిఒక్కరూ పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.
 
ప్రభుత్వము సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం అనేక సూచనలు చేయడం, ప్రజలు వాటిని పాటించడం జరుగుతోంది. వైరస్ పైన అవగాహన పెరుగుతోంది. అందువలన మనం ఇప్పుడు వైరస్ ను ఎదుర్కొనే స్థితి లో ఉన్నాము జాగ్రత్తలు వహిస్తూ..... 
 
 మన అజాగ్రత్త వైరస్ ను మన వంట్లోకి, ఇంట్లోకి తెస్తుంది.  ఏది ఏమైనా మన గురించి మనమే జాగ్రతగా ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్-19 నుంచి కోలుకున్నా దగ్గు, అలసటగానే ఉంటోందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి