Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో వందే భారత్ రైలుపై అగంతకుల రాళ్లదాడి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (08:54 IST)
ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలు హౌరా వెళ్తుండగా కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైలు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మల్దాలోని కుమార్‌గండ్ స్టేషన్‌‍లో ఈ ఘటన జరిగింది. 
 
డిసెంబరు 30వ తేదీన వెస్ట్ బెగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది దేశంలో ఏడో వందే భారత్ రైలు. హౌరా - న్యూజుల్పాయిగురి స్టేషన్ల మధ్య నడుస్తుంది. అయితే, ఈ రైలును పట్టాలెక్కించిన నాలుగు రోజుల్లోనే అగంతకులు ఈ రైలుపై రాళ్లదాడి చేశారు. ముఖ్యంగా ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. 
 
రైలు కుమార్‌గంజ్ స్టేషన్ దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే తెలిపింది. రైలు మల్దా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అయితే, ఈ దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలా కాలేదు. ఈ దాడి ఎవరు చేశారు.. ఎందుకు చేశారన్న కోణంలో ఈస్టర్న్ రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments