Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లా చెప్పాడనీ భార్య సమక్షంలో కుమార్తెను పెళ్లాడిన తండ్రి.. ఆపై గర్భవతిని కూడా...

సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలోని జల్పాయ్‌గురి జిల్లా కసియాజోరా అనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అల్లా చెప్పాడనీ కట్టుకున్న భార్య సమక్షంలోనే కుమార్

Webdunia
గురువారం, 5 జులై 2018 (16:23 IST)
సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలోని జల్పాయ్‌గురి జిల్లా కసియాజోరా అనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అల్లా చెప్పాడనీ కట్టుకున్న భార్య సమక్షంలోనే కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. పైగా, ఈ దుర్మార్గుడు కుమార్తెను గర్భవతిని కూడా చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఈ గ్రామానికి చెందిన 36 ఏళ్ల అఫాజుద్దీన్ అనే వ్యక్తి అల్లా ఆదేశించాడంటూ... తన 15 ఏళ్ల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఆయన భార్య సకీనా పూర్తి మద్దతు తెలిపింది. బిడ్డ మంచి కోసమే ఇలా చేస్తున్నానని చెప్పడంతో ఆమె సరేనంది. అయితే, ఈ విషయాన్ని ఆ దుర్మార్గుడు అత్యంత  గోప్యంగా ఉంచాడు. గ్రామస్తులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే, బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని స్థానికులు గమనించారు. 
 
దీనిపై నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో అఫాజుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన భర్తను సకీనా వెనకేసుకు రావడం గమనార్హం. తన భర్తకు అల్లాపై ఎనలేని భక్తి ఉందని... ఆయన అబద్ధం చెప్పరని ఆమె తెలిపింది. ఈ దారుణంపై అందరూ మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)

సుప్రీం తలుపుతట్టిన మోహన్ బాబు... బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది: త్రినాథరావు నక్కిన

చనిపోయిన అభిమానుల ఇంటికి సన్నిహితులను పంపిన రామ్ చరణ్ - 10 లక్షల ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments