Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యాన్స్ చేస్తూ డ్రైనేజీలో పడిన వరుడు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (09:33 IST)
ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ఓ పెళ్లి కుమారుడు డ్రైనేజీలో పడిపోయాడు. బరాత్‌లో డ్యాన్స్ చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 52లో ఉన్న హోషియార్‌పూర్‌లో ఈనెల 9వ తేదీన ఓ పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుక కోసం ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసింది. బరాత్ కోసం తగిన ఏర్పాట్లు చేశారు.
 
పెళ్లికొడుకుని మండపం వరకు తీసుకువస్తున్నారు. బాజా భజంత్రీలు, పెళ్లికొడుకు, అతని ఫ్రెండ్స్, బంధువులు అందరూ బీభత్సంగా డ్యాన్స్‌లు చేస్తున్నారు. అయితే, పెళ్లి మండపానికి, రోడ్డుకి మధ్య ఓ చిన్న మురుగుకాలువ ఉంది. ఆ కాలువ మీద నుంచి రావడానికి చిన్న బ్రిడ్జి లాంటిది ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆ బ్రిడ్జి మీద బీభత్సమైన డ్యాన్స్‌లు చేయడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పెళ్లికొడుకు సహా 15 మంది ఆ డ్రైనేజీలో పడిపోయారు. 
 
పెళ్లికొడుక్కి ఘనస్వాగతం పలికేందుకు ఆ చిన్న బ్రిడ్జికి అవతలి వైపు పెళ్లికుమార్తె తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. పెళ్లికొడుకు తరపు వారి జోష్ చూసి వారు కూడా ఆనందంగానే ఉన్నారు. అయితే, వారి కళ్లముందే కాబోయే అల్లుడు అలా మురికి కాలువలో పడిపోయేసరికి వారు కూడా షాక్‌కి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments