పెళ్లిపై నేనే ప్రకటిస్తా.. తప్పుడు వార్తలొద్దు.. విశాల్ ప్రకటన

శుక్రవారం, 11 జనవరి 2019 (13:43 IST)
పెళ్లికి సంబంధించి త్వరలోనే అన్ని విషయాలను అధికారికంగా ప్రకటిస్తానని తమిళ హీరో విశాల్ తెలిపాడు. విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇంకా వరలక్ష్మితో విశాల్ ప్రేమపెళ్లి వుంటుందని కోలీవుడ్‌లో పెద్దగా ప్రచారం సాగింది. ఈ వార్తలపై స్పందించిన విశాల్.. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నాడు. ఇది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమని.. త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ఆనందంగా ప్రకటిస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 
 
కాగా తమిళ సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం సెక్రటరీ అయిన విశాల్ వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లు.. ఆయన తండ్రి జీకే రెడ్డి ప్రకటించారు. అది పెద్దలు కుదిర్చిన వివాహం కాదని.. ప్రేమ వివాహమని విశాల్ చెప్పుకొచ్చారు. విశాల్ చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా అని.. హైదరాబాద్‌కి చెందిన విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల ముద్దుల కుమార్తె అని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఉచ్చపోయిస్తానన్న విలన్... ఊచకోత కోసిన వినయ విధేయ 'రామ్' (మూవీ రివ్యూ)