Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (09:17 IST)
దేశంలోని పవిత్ర నదుల్లో గంగానది ఒకటి. ఈ నది జలాలతో స్నానం చేయడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. అయితే, ప్రస్తుతం ఈ నది జలాలు స్నానాకి ఏమాత్రం పనికిరావట. పట్టణాల నుంచి  మురుగునీరు వచ్చి నదిలో కలుస్తోందని, అందువల్ల నీటిలో పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా చేరినట్టు గుర్తించారు. ఫలితంగా చేపల పెంపకానికి, వ్యవసాయానికి మినహా స్నానానికి ఏమాత్రం ఈ నీరు సరిపడదని బీహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేల్చింది. 
 
రాష్ట్రంలోని 34 ప్రాంతాల్లో రెండు వారాలపాటు నిర్వహించిన గంగానది నీటి నాణ్యత పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25లో ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
గంగానది, దాని ఉప నదుల ఒడ్డున ఉండే పట్టణాల నుంచి మురుగునీరు, ఇళ్ల నుంచి వచ్చి కలిసే నీరు కారణంగా నదిలో పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా చేరిందని సర్వే వివరించింది. అలాగే, గంగా, దాని ఉపనదుల్లో పీహెచ్, డిజాల్వ్‌డ్ ఆక్సిజన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ వంటివి మోతాదుకు మించి ఉన్నాయని తేల్చింది. 
 
ఈ నీరు జల జీవరాశుల, చేపల పెంపకానికి, వ్యవసాయానికి సరిపోతుందని పేర్కొంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మమ్ శుక్లా మాట్లాడుతూ, కేంద్ర కాలుష్య మండలి ప్రమాణాల కంటే గంగానదిలో చాలా చోట్ల ఫీకల్ కోలిఫాం పరిమితి మించివుందని తెలిపారు. అందువల్ల ఈ స్నానానికి పనికిరాదని చెప్ారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments