Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (09:03 IST)
కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రికాకుండా ఎవరూ అడ్డుకోలేరని అయితే, అందుకు కొంత సమయం పడుతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని డీకే శివకుమార్ ఖండించారు. 
 
ఇదే అంశంపై వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ కర్నాటక ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. డీకేకు సీఎం పదవి కాలపరిమితో కూడుకున్నదని, దీనిపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారని, కాకపోతే అందుకు కొంత సమయం పడుతుందని వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. 
 
డీకే తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ అందుకోవడం వెనుక తన పాత్ర ఉందని గుర్తుచేశారు. ఇపుడాయన రాష్ట్ర రాజకీయాల్లో విజయవంతమైన నేతగా ఎదిగారని, త్వరలోనే ఆయన సీఎం కావాలని కోరుకుందామని పేర్కొన్నారు. ఎన్ని రకాలైన ఊహాగానాలు వినిపించినా ఆయన మాత్ర సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కర్నాటక సహా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డీకే ఎంతగానో కృషి చేశారని చెప్పారు. అందువల్ల సీఎం పదవి విషయంలో ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments