మద్యం సేవించి అతివేగంగా కారును నడిపిన పెద్దాయన.. ఏమైందంటే? (వీడియో)

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (12:24 IST)
తమిళనాడు రాజధాని నగరం చెన్నైకి సమీపంలోని తాంబరం వద్ద ఘోరం జరిగింది. చెన్నైలోని తాంబరంలో 54 ఏళ్ల పెద్దాయన కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ.. బారికేడ్లను ఢీకొట్టి ముందుకు నడిపాడు. మద్యం సేవించి కారును అతివేగంగా నడపటంతో అటుగా వచ్చే ఇద్దరు బైకర్లను ఢీకొంది. 
 
ఈ ఘటనపై బైకులపై వెళ్తున్న నలుగురిలో ఇద్దరు గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. గాయపడిన వాళ్లను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కారు డ్రైవర్ వరధాన్‌ను అరెస్టు చేశారు.
 
ఈ ఘటనపై బైకర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఇదే కారు అంతకంటే.. ముందు జంక్షన్‌ సీసీటీవీ ఫుటేజ్‌లో వుందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

క్రోంపేట ట్రాఫిక్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 338కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments