Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద్ పుష్కర్‌కు విషమిచ్చి చంపేశారా? డీఎన్ఏ రిపోర్టు ఏం చెపుతోంది?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్‌కు విషమిచ్చి చంపేసినట్టు వార్తలు వస్తున్నాయి. సునంద పుష్కర్ గత 2014 జనవరి 17వ తేదీన ఢిల్లీలోని లీలా ప్యాలెస్

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (09:09 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్‌కు విషమిచ్చి చంపేసినట్టు వార్తలు వస్తున్నాయి. సునంద పుష్కర్ గత 2014 జనవరి 17వ తేదీన ఢిల్లీలోని లీలా ప్యాలెస్ నక్షత్ర హోటల్‌లో అనుమానాస్పదరీతిలో చనిపోయిన విషయం తెల్సిందే. 
 
ఆమెపై విష ప్రయోగం జరిగిందని, ఈ విషయం దర్యాప్తు అధికారులకు కూడా తెలుసని డీఎన్ఏ వార్తా సంస్థ సంచలన వార్తా కథనాన్ని ప్రచురించింది. అప్పటి డిప్యూటీ పోలీస్ కమిషనర్ బీఎస్ జైస్వాల్ ఈ కేసులో ప్రాథమిక నివేదిక రూపొందించారని పేర్కొంది. విష ప్రయోగం వల్లే ఆమె మృతి చెందినట్టు జైస్వాల్ నివేదికలో ఉందని వివరించింది.
 
సునంద శరీరంపై 15 గాయాలున్నాయని, చేతిపై ఉన్న పదో నంబరు గాయం నుంచి ఇంజక్షన్ ఇచ్చారని తెలుస్తోందని జైస్వాల్ రూపొందించిన ప్రాథమిక నివేదికలో ఉందని పేర్కొంది. 12 నంబరు గాయంపై పంటిగాటు ఉందని, అల్ఫ్రాజోలం ప్రయోగం వల్లే ఆమె మృతి చెందినట్టు భావిస్తున్నామని జైస్వాల్ తన నివేదికలో పేర్కొన్నట్టు డీఎన్ఏ రిపోర్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments