Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యాపారుల వద్ద ఏవీ కొనుగోలు చేయొద్దు : బీజేపీ ఎమ్మెల్యే పిలుపు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (20:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం మర్కజ్ మత సమ్మేళనమే కారణమని, అందువల్ల ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు, ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురేష్ తివారీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశమంతా పోరాడుతుందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, ప్రజలెవ‌రూ ముస్లింల వద్ద కురగాయలుగానీ, ఎలాంటి ఇత‌ర వస్తువులుగానీ కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాపించ‌డానికి కారణం కూడా ముస్లింలేనని ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనలవ‌ల్లే క‌రోనా విస్త‌రించింద‌ని వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలపై యూపీలోని విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments