Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడినన్న కనికరం కూడా చూపలేదు.. పలుమార్లు లాఠీతో కొట్టారు.. ఇవిగో గాయాలు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (08:58 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులంతా ఏకమై ఆందోళన చేపట్టారు. ఛలో ఢిల్లీ పేరిట జరుగుతున్న ఈ ఆందోళన ఇపుడు ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు ప్రాంతంలో నిరసనలు చేపడుతున్న రైతులపై పోలీసులు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) బృందాలు లాఠీఛార్జ్ చేశాయి. 
 
ఈ క్రమంలో సుఖ్‌దేవ్‌ సింగ్‌ (60) అనే వృద్ధ రైతుపై లాఠీ చార్జీ చేస్తున్న ఓ పోలీసు ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు ఈ ఫోటోను షేర్‌ చేస్తూ రైతులపై అధికార బీజేపీ చేస్తున్న దమనకాండను ప్రశ్నించారు. 
 
అయితే, రైతులపై విపక్షాలు చేస్తున్న విమర్శలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తిప్పికొట్టారు. తమ పార్టీపై బురదజల్లేందుకే కొందరు ఇలాంటి దుష్ప్రచారానికి తెరతీశారని వివరణ ఇచ్చారు. సుఖ్‌దేవ్‌కు పోలీసుల లాఠీ తాకలేదని పేర్కొంటూ.. 'ప్రొపగండా vs రియాలిటీ' పేరిట ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. 
 
ఇదిలావుంటే, సంబంధిత రైతులు ఓ ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరి ఇటర్వ్యూ చేశారు. జరిగిన ఘటనను ఆయన వివరించారు. 'జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించి పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత లాఠీచార్జీ చేశారు. 
 
దీంతో కాళ్లు, వీపు, శరీరం మొత్తం నాకు గాయాలయ్యాయి, కావాలంటే చూడండి ఇవిగో గాయాలు.. అంటూ భుజంపై కమిలిపోయిన ఓ గాయాన్ని కూడా చూపించారు. వృద్ధున్నని కూడా చూడకుండా పోలీసులు తనపై లాఠీలతో విరుచుకుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
మరోవైపు, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన వీడలేదు. గురువారం ఇక్కడ విజ్ఞాన్‌ భవన్‌లో 8 గంటల పాటు కొనసాగిన చర్చలు ఎటువంటి పరిష్కారం కనుగొనకుండానే ముగిశాయి. 'నల్ల' చట్టాలుగా అభివర్ణిస్తూ రైతులు వ్యతిరేకిస్తున్న మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని చర్చల సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. 
 
కొత్త సాగు చట్టాలపై రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఓపెన్‌ మైండ్‌తో చర్చిస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం తరపున వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సారథ్యంలో రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌, వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్‌ చర్చల్లో పాల్గొన్నారు. నిరసనోద్యమం కొనసాగిస్తున్న రైతుల తరఫున వివిధ సంఘాలకు చెందిన 40 మంది ప్రతినిధుల బృందం హాజరైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments