Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోడీ నల్ల చట్టానికి వ్యతిరేకంగా 26న సార్వత్రిక సమ్మె

ప్రధాని మోడీ నల్ల చట్టానికి వ్యతిరేకంగా 26న సార్వత్రిక సమ్మె
, బుధవారం, 25 నవంబరు 2020 (11:43 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్ని 26వ తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. తమకు అనుకూలురైన కొద్దిమంది కార్పొరేట్లకు సంపదను దోచిపెట్టేందుకు దేశంలోని కోట్లమంది కార్మికుల జీవితాలను మోడీ సర్కారు ఫణంగా పెట్టిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, కార్మికుల జీవితాలకు భద్రతను, ఉద్యోగాలకు భరోసాను అందిస్తున్న 44 కార్మిక చట్టాలను ఒక్క కలంపోటుతో ఖతం చేసి చెత్తబుట్టలో వేసింది. బ్రిటిష్‌ కాలంనాటి బానిస చట్టాలను కొత్తరూపంలో మళ్లీ అమల్లోకి తెచ్చింది. 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిన ఈ నల్లచట్టాలను మోడీ ప్రభుత్వం ఇటీవలే నాలుగు కోడ్‌ల రూపంలో తెచ్చింది. 
 
1. వేతనాలు, 2. భద్రత, ఆరోగ్యం, 3. పని పరిస్థితులు, 4. సామాజిక భద్రత. వీటి పేరుతో పాశవిక చట్టాలను కార్మికులపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చిన వెంటనే కార్మికులకు సంఘాలు పెట్టుకొని, సమ్మెచేసే హక్కులు చేజారిపోతాయి. గతంలో సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు యాజమాన్యానికి నోటీసు ఇస్తే సరిపోయేది. ప్రస్తుతం దీన్ని 60 రోజులకు పెంచారు. 
 
సమ్మెకు వ్యతిరేకంగా యాజమాన్యమే ట్రిబ్యునల్‌కు వెళ్లే వెసులుబాటును కూడా బీజేపీ సర్కారు ఇచ్చింది. వివాదం ట్రిబ్యునల్‌లో ఉన్నంతకాలం కార్మికులు సమ్మె చేయటానికి వీలుకాదు. దాంతో అంతిమంగా సమ్మె చేసే అవకాశమే ఉండదు. ఇలాంటి షరతులు, నిబంధనలతో రూపొందించిన కొత్త కార్మిక చట్టానికి వ్యతిరేకంగా 26వ తేదీ గురువారం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. 
 
కాగా ప్రధాని మోడీ సర్కారు అమలు చేయనున్న కొత్త చట్టంలోని కొన్ని కార్మక వ్యతిరేక నిబంధనలను పరిశీలిస్తే, 
* ఉద్యోగం కావాలా? వెట్టి చాకిరీ చేయాల్సిందే! 
* పనికి తగిన వేతనం అడిగావా? నీకు తెల్లారి పనే ఉండదు! 
* హక్కుల కోసం సమ్మె చేస్తానంటావా? అది దేశద్రోహమంత నేరం! 
* యజమానికి నువ్వు బానిస. ఎప్పుడు పనికి రమ్మంటే అప్పుడు రావాల్సిందే.
* ఎన్ని గంటలైనా పని చేయాల్సిందే. ఏమిటిది అని అడుగకూడదు. 
* అధిక పనికి అదనపు వేతనం అస్సలు అడుగరాదు.
* సెలవులు ఇచ్చినప్పుడే తీసుకోవాలి.. ఇవ్వకున్నా కిక్కురుమనొద్దు. 
* జీతం ఇస్తున్నాడు కాబట్టి నీపై యజమానికి అపరిమిత హక్కులుంటాయి. 
* ఇదీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తెచ్చిన కొత్త కార్మిక చట్ట సారాంశం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమ్మీద వీడంతటి అదృష్టవంతుడు మరొకరు ఉండరు ... ఎందుకో తెలుసా? (Video)