Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు కరోనా హెచ్చరిక!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:46 IST)
పండుగ సీజన్‌ సమీపిస్తున్న వేళ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అయితే ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభించే ప్రమాదం ఉన్నందున రైల్వే భద్రతా దళం (ఆర్‌పీఎఫ్‌) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రజలు రైల్వే స్టేషన్లలోకి వచ్చినప్పుడు, రైళ్లలో, రైల్వే పరిసరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తాము జారీచేసిన నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కొవిడ్‌ కట్టడే లక్ష్యంగా విధించిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రైల్వే చట్టం -1989లోని పలు సెక్షన్ల కింద జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
 
ఆర్‌పీఎఫ్‌ కీలక సూచనలివే.. 
 
* మాస్క్‌ ధరించకుండా రైల్వే పరిసరాలకు రావొద్దు.
* భౌతికదూరం పాటించాల్సిందే.
* కరోనా పాజిటివ్‌ అని తెలిసి కూడా రైల్వే స్టేషన్లకు రావొద్దు. రైళ్లలోకి ప్రవేశించొద్దు.   
* కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఇంకా ఫలితం రాకుండా స్టేషన్‌లోకి, రైళ్లలోకి వెళ్లొద్దు. 
* రైల్వే స్టేషన్‌ వద్ద వైద్య బృందం చెకప్‌ చేయడాన్ని నిరాకరించి రైలెక్కినా చర్యలు తప్పవు. 
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా, చెత్తాచెదారం విసిరేసినా కఠిన చర్యలు.  
* రైల్వే స్టేషన్లు/ రైళ్లలో అపరిశుభ్ర వాతావరణం సృష్టించి.. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దు.
* కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments