Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌కు హెచ్చరిక

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:02 IST)
గుజరాత్‌ దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు 2వ తేదీ వరకు అరేబియా సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు సాయంత్రానికల్లా ఒడ్డుకు తిరిగి రావాలని సూచించింది. గులాబ్‌ తుపాను ప్రభావం కారణంగా ఈ అల్పపీడనం ఏర్పడిందని ఐఎండి తన బులెటిన్‌లో పేర్కొంది. దక్షిణ గుజరాత్‌లోని పలు ప్రాంతాలతో పాటు సౌరాష్ట్ర రీజియన్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రానున్న రెండు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. గుజరాత్‌లో ఇప్పటి వరకు వార్షిక సగటు వర్షపాతంలో 90 శాతం నమోదైందని రాష్ట్ర ప్రత్యేక అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్‌ఇఒసి) తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments