భారత్‌కు వచ్చిన శివాజీ యుద్ధ సమయంలో వాడిన వాఘ్‌నఖ్‌

వరుణ్
గురువారం, 18 జులై 2024 (11:45 IST)
వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధం వాఘ్ నఖ్. ఇది పులి పంజా ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాఘ్ నఖ్‌ను చేతికి ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చివేయవచ్చు. 1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్టల్ ఖాన్‌ను చంపడానికి శివాజీ ఈ వాఘ్ నఖ్‌ను ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది. 
 
కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్‌కు చేరింది. లండన్‌లోని ప్రఖ్యాత విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. అయితే, అనేక ప్రయత్నాలు చేసిన మీదట, వందల ఏళ్ల తర్వాత ఈ ఆయుధం తిరిగి భారత్ చేరుకుంది. బుల్లెట్ ప్రూఫ్ కవర్‌లో ఉంచి ఈ ఆయుధాన్ని భద్రంగా భారత్‌కు తీసుకువచ్చారు.
 
శివాజీ ఉపయోగించిన ఈ వాఘ్ నఖ్ లండన్ నుంచి ముంబయి చేరుకున్నట్టు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ వెల్లడించారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఈ వాఘ్ నఖ్‌ను ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచుతున్నామని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments