Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జలపాతం వద్ద రీల్స్.. లోయలోపడి చార్టెడ్ అకౌంటెంట్ మృతి!!

anvi kamdar

వరుణ్

, గురువారం, 18 జులై 2024 (08:43 IST)
ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరిలో సెల్ఫీలు, రీల్స్ పిచ్చి ఎక్కువైపోతుంది. ఈ రీల్స్ చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ప్రాణాలు కోల్పోయే వారిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం విచారించదగిన విషయంగావుంది. తాజాగా ఓ జలపాతం వద్ద రీల్స్ చేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ ప్రమాదవశాత్తు లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకరఘటన మహారాష్ట్రలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకు చెందిన అన్వీ కమ్దార్ అనే మహిళ చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉన్నారు. ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి రాయగఢ్‌లోని ప్రఖ్యాత కుంభే జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ రీల్స్ చేస్తూ రికార్డు చేస్తుండగా ప్రమాదవశాత్త కాలుజారి 300 అడుగుల లోతులో ఉన్న జలపాతంలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయారు. విహార యాత్రకు వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. 
 
ఈ ప్రమాదంపై ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అన్వీ కామ్దార్‌ను లోయలో నుంచి వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయినప్పటికీ అన్వీ కామ్దార్‌కు సెల్ఫీలు, రీల్స్ చేయడం మహాయిష్టం. అందుకే నిత్యం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా ఆఫర్‌లు: ఎకో స్మార్ట్ స్పీకర్‌, అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబోలపై 55% వరకు తగ్గింపు