Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని సెట్ చేయాలంటూ... విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ కామాంధుడయ్యాడు. హాస్టల్‌లో ఉంటున్న వరుసకు బావ అయ్యే యువకుడిని చూసేందుకు వచ్చిన ఓ విద్యార్థినిపై సైన్స్ పాఠాలు చెప్పే కామాంధ టీచర్ లైంగికదాడిపాల్పడ్డాడు.

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (09:16 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ కామాంధుడయ్యాడు. హాస్టల్‌లో ఉంటున్న వరుసకు బావ అయ్యే యువకుడిని చూసేందుకు వచ్చిన ఓ విద్యార్థినిపై సైన్స్ పాఠాలు చెప్పే కామాంధ టీచర్ లైంగికదాడిపాల్పడ్డాడు.

తనకో అమ్మాయిని సెట్ చేయాలంటూ బెదిరిస్తూ, ఆ తర్వాత ఆ విద్యార్థిని గట్టిగా వాటేసుకుని చేయకూడని పనులన్నీ చేశాడు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో పదిరోజులైనప్పటికీ ఆ విద్యార్థిని నోరుమెదపలేదు. కానీ, మౌనంగా ఉండటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు గద్దెంచి అడగడంతో ఈ విషయం బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
విశాఖ ఏజెన్సీలోని గూడెంకొత్తవీధిలోని చాపరాతిపాలెం గ్రామానికి చెందిన 16 యేళ్ళ బాధితురాలు చింతపల్లి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. తనకు వరుసకు బావ అయ్యే యువకుడు ఏకలవ్య బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడిని కలుసుకోవడం కోసం గత నెల 26వ తేదీన అతని హాస్టల్‌కు వెళ్లింది. వారిద్దరు మాట్లాడుకొంటుండగా, అటుగా సైన్సు టీచర్‌ వీసం వెంకటరామకృష్ణారావు వచ్చాడు. 
 
విద్యార్థిని అక్కడినుంచి తరిమికొట్టి, ఆమెపై అత్యాచారం జరిపాడు. 'వదిలేయమని ప్రాధేయపడ్డాను. అయితే, తనకు మరొకరిని సెట్‌ చెయ్యాలంటూ నన్ను గట్టిగా పట్టుకొన్నాడు. వద్దు.. వద్దు అని వేడుకొన్నా వినలేదు. నన్ను తీవ్రంగా కొట్టాడు. బట్టలు చింపేశాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు' అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments