Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

సెల్వి
సోమవారం, 16 జూన్ 2025 (14:48 IST)
Rapido Bike rider
బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్లకు సంబంధించిన నేరాలు పెరిగిపోతున్నాయి. గత ఏడాది ర్యాపిడో ట్యాక్సీ డ్రైవర్.. తన స్నేహితుడితో కలిసి 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. తాజాగా ట్యాక్సీ డ్రైవర్లే కాదు.. ర్యాపిడో స్కూటర్ డ్రైవర్లు కూడా ప్రయాణీకుల పట్ల అకృత్యాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా బెంగళూరులో ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ అమ్మాయికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆ ర్యాపిడో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌తో యువతికి చుక్కలు చూపించాడు. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేశాడని ఆ యువతి నిలదీయడంతో అతడు ఆవేశంతో రగిలిపోయాడు. మాటామాటా పెరగడంతో యువతిపై చేజేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో ర్యాపిడో బైక్ రైడర్ సదరు అమ్మాయిని బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనను స్థానికులు ఏమాత్రం అడ్డుకోలేదు. కళ్లప్పగించి మాత్రం చూస్తుండిపోయారు. 
 
ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments