Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్లతో వ్యభిచారం చేయలేదనీ రిసార్ట్స్ రిసెప్షనిస్ట్ హత్య

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:42 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత కుమారుడు ఒకడు దారుణానికి పాల్పడ్డాడు. తన రిసార్టులో రిసెప్షనిస్టుగా పని చేసే 19 యేళ్ళ యువతిని రిసార్టుకు వచ్చే కస్టమర్లతో వ్యభిచారం చేయాలని బలవంతం చేశాడు. వేధించాడు. అయినప్పటికీ ఆ యువతి సమ్మతించలేదు. దీంతో రిసార్టు మేనేజర్‌తో కలిసి బీజేపీ నేత కుమారుడు ఆ యువతిని కాలువలో తోసి చంపేశాడు. తన స్నేహితురాలికి మృతురాలు పంపింపిన ఓ ఆడియో, మెసేజ్‌ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత కుమారుడు పులకిత్ ఆర్య, ఆ టీనేజి అమ్మాయి పనిచేస్తున్న రిసార్టు మేనేజర్ సౌరభ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి మృతదేహాన్ని ఈ ఉదయం ఓ కాలువ వద్ద గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఆ యువతి తన స్నేహితురాలికి పంపినట్టుగా భావిస్తున్న వాట్సాప్ సందేశాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను వేశ్యగా మార్చేందుకు రిసార్టు వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆమె తన సందేశాల్లో పేర్కొంది. 
 
రూ.10 వేలు చెల్లించిన కస్టమర్లకు 'ప్రత్యేక సేవలు' అందించాలని రిసార్టు యాజమాన్యం తనను ఒత్తిడికి గురిచేస్తోందని ఆమె వెల్లడించింది. పైగా, రిసార్టులో ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, అయితే, అతడు మద్యం మత్తులో ఉన్నందున ఆ విషయాన్ని పట్టించుకోవద్దని రిసార్టు యాజమాన్యం చెప్పిందని ఆమె తన సందేశంలో వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్‌ను తగ్గాల్సిందే అన్నది ఎవరు? స్పెషల్ స్టోరీ

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments