ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. అయితే, క్షతగాత్రులను రక్షించడంలో తీవ్ర జాప్యం జరుపుతోంది. దీనికి కారణం ప్రమాదం జరిగిన ప్రాంతంలో వర్షం కురుస్తోంది. బస్సు అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మరో 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ముస్సోరి పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను వెలికి తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.