Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

ఠాగూర్
మంగళవారం, 22 జులై 2025 (08:59 IST)
పాతికేళ్ల క్రితం వివాహం చేసుకుని, భర్త, నలుగురు పిల్లలతో సంసార జీవితాన్ని సాగిస్తూ వచ్చిన ఓ మహిళ.. పాతికేళ్ల వయస్సున్న మేనల్లుడుతో ప్రేమలో పడింది. అతని మాయలో లీనమైపోయిన ఆ మహిళ... అతనికి దూరంగా ఉండలేక అతనితో కలిసి పారిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని సిద్ధార్ద నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ పోషణ కోసం నెలలో చాలా రోజులు ఇంటికి దూరంగా ఉంటుంటే.. ఆ ఇంటికి ఆమె మేనల్లుడు (25) తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో ఆ ఇల్లాలికి, ఆ యువకుడి మధ్య చనువు పెరిగి.. అది ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. గత ఏడాది ఆమె, తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. దీనిపై ఆ భర్త, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కొన్నాళ్లకు ఆ యువకుడితో గొడవలు తలెత్తడంతో ఆమె తిరిగి తన భర్త దగ్గరకు వచ్చేసింది. ఆమెను పెద్ద మనసుతో భర్త క్షమించేసి అక్కున చేర్చుకున్నాడు. ఆటు.. ఆమె ప్రియుడు కూడా ఇక ఎంతమాత్రం కలిసి ఉండే ప్రసక్తే లేదని పోలీసుల సాక్షిగా చెప్పాడు. అయితే కొన్నాళ్లకు.. ఆమె మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడి చెంతకు చేరింది. ఆదివారం అతడిని వెంటబెట్టుకొని ఊరొచ్చేసింది. బంధువులు, గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. 
 
తనకు భర్త వద్దని, ప్రియుడితోనే కలిసి ఉండాలనుకుంటున్నట్లు పెద్దల ఎదుట ఆమె స్పష్టం చేసింది. 'నాతో కలిసి ఉండటానికి ఆమెకు ఇష్టంలేక పోతే.. ఆమెను నిరోధించే హక్కు నాకెక్కడిది?' అని చెబుతూ ప్రియుడితో కలిసి వెళ్లిపోయేందుకు భర్త అనుమతినిచ్చాడు. కాగా, ఆ మహిళకు ఉన్న నలుగురు పిల్లల్లో పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి కుమార్తె వయసు 22 యేళ్లు కాగా, రెండో కుమార్తె వయసు 18 యేళ్లు. అలాగే, ఇద్దరు కుమారుల్లో ఒకరి వయసు 17 యేళ్ళు, మరొకరి వయసు 10 యేళ్ళు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments