ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదనీ మైనర్ బాలికపై అత్యాచారం...

ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ముర్దానగర్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (16:48 IST)
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ముర్దానగర్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ముర్దానగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక.. ఓ పండుగ నిమిత్తం ఓ వ్యక్తి నుంచి రూ.1500 అప్పు తీసుకుంది. అయితే ఆ డబ్బులు ఆమె తిరిగి చెల్లించలేక పోయింది. కానీ, ఆ వ్యక్తి మాత్రం డబ్బులు చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి చేయసాగాడు. అయనప్పటికీ ఆ యువతి ఇవ్వలేక పోయింది.
 
అయితే గురువారం కొన్ని పత్రాలను జిరాక్స్ తీయించుకుని తిరిగి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో డబ్బులిచ్చిన వ్యక్తులు జాహీద్, మోహన్ పాల్‌తో పాటు మరో మైనర్ కలిసి ఆ బాలికను ఆపారు. అక్కడ్నుంచి నిర్మానుష్య ప్రదేశంలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఆ వారి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చిన ఆ యువతి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు జాహీద్, మోహన్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments