Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల చిన్నారిపై దారుణం.. అత్యాచారం, హత్య.. కుక్కలు కొరుక్కుని..

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (11:48 IST)
యూపీలో నాలుగేళ్ల చిన్నారిపై దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు దుండగులు. యూపీలోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలిక ఫరూఖాబాద్‌లోని తన ఇంటి ముందు ఆడుకుంటుంది. 
 
కానీ కొద్దిసేపటి తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. వారితో పాటు గ్రామస్థులు కూడా వెతికారు. అయితే పొలంలో ఓ కుక్కల గుంపు వుండటం చూశారు. అక్కడికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. 
 
బాలిక మృతదేహాన్ని కుక్కలు కొరుక్కు తింటున్నాయి. ఆ శవాన్ని తన కుమార్తెగా గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవపరీక్షలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు. నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఆడుకుంటున్న బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఆపై వేరొక వ్యక్తి సాయంతో చంపేసినట్లు నిందితుడు వెల్లడించాడు. దీంతో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ చిన్నారిని దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments