జవాబు పత్రంలో రూ.100 నోటు పెడితే.. గుడ్డిగా మార్కులేస్తారు...

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (12:53 IST)
విద్యార్థులకు నాలుగు మంచి మాటలు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు... వక్రమార్గంలో పయనించాడు. కష్టపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పాల్సిన గురువు... తప్పుడు మార్గంలో మార్కులు ఎలా సంపాదించుకోవాలో విద్యార్థులకు వివరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం నుంచి టెన్త్, ఇంటర్‌ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎగ్జామ్స్‌ ప్రారంభం కంటే ముందు మావు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌ మాల్‌ తమ విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్‌పై ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.
 
ఇందులో ప్రిన్సిపాల్ ప్రసంగిస్తూ, తాను ఛాలెంజ్‌ చేస్తున్నా.. ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్‌ కావడానికి ఆస్కారం లేదు. పరీక్షలంటే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇతరుల చేతులను ఎవరూ తాకకూడదు. కేవలం సైగలతోనే మాట్లాడుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులంతా తన స్నేహితులే. ఒక వేళ మీరు చిట్టీలు కొడుతూ పట్టుబడ్డ.. ఒకట్రెండు చెంపదెబ్బలు కొడుతారు.. అయినప్పటికీ ఏం బాధపడొద్దు. 
 
ఇక ఒక్క ప్రశ్నను కూడా వదిలిపెట్టొద్దు. మీరు చేయాల్సిందల్లా.. జవాబు పత్రంలో ప్రతి విద్యార్థి రూ.100 పెట్టాలి. దీంతో టీచర్లు గుడ్డిగా మార్కులు వేస్తారు. మీరు ఒక వేళ సమాధానం తప్పు రాసినా.. నాలుగు మార్కుల ప్రశ్నలకు మూడు మార్కులు ఖచ్చితంగా వేస్తారు అని ప్రవీణ్‌ మాల్‌ చెప్పారు.
 
ప్రిన్సిపాల్‌ ప్రసంగం చేస్తున్న సమయంలో అక్కడున్న ఓ విద్యార్థి సీక్రెట్‌గా వీడియో చిత్రీకరించి.. దాన్ని సీఎం యోగి గ్రీవెన్స్‌ సెల్‌లో అప్‌లోడ్‌ చేశాడు. వీడియో ఆధారంగా సీఎం యోగి విచారణకు ఆదేశించారు. దీంతో ప్రవీణ్‌ మాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments