Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి కాయ కావాలని మారాం చేసిన మేనకోడలి హత్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (14:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడికాయ కావాలని మారాం చేసిన మేనకోడల్ని చంపేశాడో ఓ కిరాతకుడు. ఈ కిరాతకుడు అన్నం తింటుండగా వచ్చి మామిడికాయ కావాలంటూ పదేపదే కోరింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ కిరాతకుడు ఇనుపరాడ్‌తో ఆమెపై దాడి చేసి చంపేశాడు. దీంతో ఐదేళ్ళ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో ఈ దారుణం జరిగింది. 33 యేళ్ల ఉమర్దీన్ అనే వ్యక్తి భోజనం చేస్తుండగా మేనకోడలు వరుస అయ్యే ఖైరూ నిషా (5) అక్కడికి వచ్చి మామిడికాయ కావాలంటూ అడిగింది. దీంతో తీవ్ర అసహనానికి లోనై ఉమర్దీన్ ఓ రాడ్‌ తీసుకుని ఆ చిన్నారి తలపై కొట్టాడు. ఆపై పదునైన వస్తువుతో గొంతుకోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ బాలిక అక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఉమర్దీన్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి చిన్నారి హత్యకు ఉపయోగించిన ఓ ఐరన్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments