Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడు తండ్రినా.. లేకుంటే రాక్షసుడా.. కుమార్తె తల నరికి చేత్తో పట్టుకుని..?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (10:07 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో వీరంగం వేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.... పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి, నరికేసిన తన కుమార్తె తల చేత్తో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
విషయం తెలుసుకున్న ఇద్దరు పోలీసు అధికారులు సర్వేశ్ నడుస్తున్న మార్గాన్ని అడ్డగించి ఆ తల ఎవరిదని ప్రశ్నించగా, ఏ మాత్రం సంకోచం లేకుండా, అది తన కుమార్తెదని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, హత్య చేసింది మాత్రం తానేనని చెప్పాడు. 
 
ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అందుకే భరించలేక హత్య చేశానని అన్నాడు. ఆపై పోలీసులు నరికిన తల కిందపెట్టి, కూర్చోవాలని సూచించగా, చెప్పినట్టుగానే చేశాడు. మిగతా శరీరభాగం ఇంట్లోనే ఉందని చెప్పాడు. ఆపై అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు, కేసును విచారిస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments