తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (10:04 IST)
తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో తూర్పు దిశనుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని రోజులుగా 39 డిగ్రీలుగానమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. 
 
రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.5 డిగ్రీల నుంచి 39.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో 39 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
గాలిలో తేమ 27 నుంచి 82 శాతం వరకు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా అర్లిలో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.
 
అలాగే వారం రోజుల కిందటి వరకు చల్లగాలులు, పొగ మంచు దుప్పట్లు కప్పుకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అప్పుడే భానుడు భగభగమనిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments