Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. పుట్టిన బిడ్డను రూ.25 వేలకు తెగనమ్మిన భర్త

ప్రేమ పేరుతో ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఆపై మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు పుట్టిన బిడ్డను 25 వేల రూపాయలకు విక్రయించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:51 IST)
ప్రేమ పేరుతో ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఆపై మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు పుట్టిన బిడ్డను 25 వేల రూపాయలకు విక్రయించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒక మహిళ జరీ వర్క్ చేసేందుకు 2013లో ఎంబ్రాయిడరీ పనిచేసే షావేజ్ అనే యువకుడి వద్ద పనికి చేరింది. అలా వారిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమకు, ఆ తర్వాత శారీరక సంబంధానికి దారి తీసింది. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి యవతికి అతడి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. విషయం పెద్దలకు చేరడం, పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో షావేజ్ ఆమెను వివాహం చేసుకోక తప్పలేదు. 
 
ఆ తర్వాత వారికి పుట్టిన బిడ్డను పిల్లలులేని దంపతులకు రూ.25 వేలకు విక్రయించిన షావేజ్ భార్యకు విడాకులిచ్చాడు. అనంతరం ఓ మధ్య వయసు వ్యక్తిని చూసి ఆమెకు బలవంతంగా పెళ్లి చేశాడు. అతడికి అప్పటికే ఏడుగురు పిల్లలున్నారు. అక్కడినుంచి ఎలాగో తప్పించుకున్న బాధితురాలు మరోమారు పోలీసులను ఆశ్రయించింది. షావేజ్ ద్వారా తాను పడుతున్న ఇబ్బందులను వారికి వివరించింది. తనను రెండుసార్లు మోసం చేసిన అతడిని చట్టపరంగా శిక్షించాలని వేడుకుంది. విక్రయించిన తన బిడ్డను తిరిగి తనకు అప్పగించాల్సిందిగా వేడుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments