Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌కు భార్య వత్తాసు: నా భర్త జెంటిల్మెన్.. కితాబు.. మిషెల్ ప్రసంగం కాపీ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఆయన భార్య మిలానియా ట్రంప్ మద్దతు తెలిపారు. ట్రంప్‌ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వచ్చాక మొట్టమొదటిసారి ఆయన సతీమణి స్పందించార

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:40 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఆయన భార్య మిలానియా ట్రంప్ మద్దతు తెలిపారు. ట్రంప్‌ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వచ్చాక మొట్టమొదటిసారి ఆయన సతీమణి స్పందించారు. అసలు ఈ వ్యవహారం మొత్తాన్ని ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పన్నిన వ్యవస్థీకృత కుట్రగా ఆమె తేల్చేశారు. ట్రంప్‌పై ఆరోపణలు చేసిన మహిళల చరిత్ర మీడియాకు తెలుసా అని ప్రశ్నించారు. 
 
ట్రంప్ ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించరని పేర్కొన్నారు. తన భర్త జెంటిల్మెన్ అని కితాబిచ్చారు. ఆరోపణలు చేసిన మహిళలు అబద్ధాల కోరులని ధ్వజమెత్తారు. బిల్లీ బుష్‌ వ్యవహారంలో కూడా తన భర్త తప్పులేదని తేల్చేసింది. తన భర్తపై తనకు పూర్తి నమ్మకముందని పేర్కొంది. ఆయనో దయగల మనిషిగా అభివర్ణించింది. 
 
ఇదిలా ఉంటే..  రిపబ్లిక‌న్ అభ్య‌ర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మిలానియా అమెరికా ఫ‌స్ట్ లేడీ మిషెల్ ఒబామా ప్ర‌సంగాన్ని కాపీ కొట్టారని వార్తలొస్తున్నాయి. క్లీవ్‌ల్యాండ్‌లో జరుగుతున్న రిప‌బ్లిక‌న్ పార్టీ జాతీయ స‌మావేశంలో మిలానీయా స‌భ‌ను ఉద్దేశించి పది నిమిషాలు మాట్లాడారు. అయితే ఈ ప్రసంగంలో మిషెల్ ప్రసంగాన్నే చదివి వినిపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 
 
2008లో డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున దేశాధ్య‌క్ష అభ్య‌ర్థిగా బ‌రాక్ ఒబామా ఎన్నికైన త‌ర్వాత జాతీయ స‌మావేశం నిర్వ‌హించారు. ఆ స‌మావేశంలో మిషెల్ ఒబామా మాట్లాడారు అయితే అప్పుడు ఆమె చేసిన ప్ర‌సంగంలోని కొన్ని పేరాలు ప్రస్తుతం మిలానియా ట్రంప్ చేసిన ప్రసంగంలో రిపీట్ అయినట్లు విశ్లేషకులు అంటున్నారు. 
 
కష్టపడే తత్వాన్ని తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నానని మిలానీయా ప్రసంగంలో పేర్కొంది. కానీ అచ్చం అలాంటి మాటలే ఎనిమిదేళ్ల క్రితం మిషెల్ ప్ర‌సంగంలో కూడా వినిపించాయి. దాంతో మిషెల్ ప్ర‌సంగాన్ని మిలానియా కాపీ కొట్టారనే వార్తలొస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments