Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామవేదికపై అమ్మాయిలకు ముద్దులుపెడుతూ.. నృత్యం చేస్తూ అధికారుల మజా...

వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత గ్రామంలో డీజే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో అధికారులు పాల్గొన్నారు.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (17:25 IST)
వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత గ్రామంలో డీజే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో అధికారులు పాల్గొన్నారు. పీకలవరకు మద్యం సేవించారు. వేదికపై అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశారు. ముద్దులు పెట్టారు. కౌగిలించుకున్నారు. అలా మజా చేసిన అధికారులు చివరకు జిల్లా కలెక్టర్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగాపూర్ గ్రామంలో జరిగింది. యూపీ ప్రభుత్వ ఉద్యోగులైన కౌశిక్, ముఖేష్ కుమార్‌లు ఇద్దరు గంగాపూర్ గ్రామంలో పీకల దాకా తాగి అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మాయిలకు ముద్దులు పెడుతూ.. నృత్యం చేశారు. మందు మత్తులో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన నిర్వాకంపై తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. 
 
దీంతో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్యోగులు తాగి అమ్మాయిలతో తందనాలాడారని ఆగ్రహం చెందిన హాత్రాస్ జిల్లా కలెక్టరు అవినాష్ కృష్ణ సింగ్ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీంతో మద్యంతాగి అమ్మాయిలతో మజా చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మత్తు వదిలినట్లయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments