Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారో తెలుసా?

అమ్మా స్కూల్‌కు వెళతా.. ఉండు నాన్నా మంచి ర్యాంక్ సాధించిన ప్రైవేటు స్కూల్లో నిన్ను చేర్పిస్తా.. ప్రభుత్వ పాఠశాలల పక్కకే వెళ్ళొద్దు నాన్నా అంటూ చెబుతుంటారు చాలామంది తల్లిదండ్రులు. అందుకే ప్రభుత్వ పాఠశాలల ఆదరణ తగ్గిపోయి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళే వారి స

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (16:52 IST)
అమ్మా స్కూల్‌కు వెళతా.. ఉండు నాన్నా మంచి ర్యాంక్ సాధించిన ప్రైవేటు స్కూల్లో నిన్ను చేర్పిస్తా.. ప్రభుత్వ పాఠశాలల పక్కకే వెళ్ళొద్దు నాన్నా అంటూ చెబుతుంటారు చాలామంది తల్లిదండ్రులు. అందుకే ప్రభుత్వ పాఠశాలల ఆదరణ తగ్గిపోయి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అసలెందుకు ఈ విధంగా జరుగుతోంది.
 
ప్రైవేట్ పాఠశాలలకు ఆదరణ, ప్రభుత్వ పాఠశాలల మీద ఏవగింపు
 
గత అయిదేళ్ల కాలంలో 20 రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలో చేరే వారి సంఖ్య కోటి 30 లక్షలు తగ్గితే ప్రైవేట్ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య కోటి 75 లక్షలు పెరిగింది. 2010-11 నుంచి 2015-16 మధ్య ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో చేరే వారి సంఖ్య 122 నుంచి 108కి తగ్గింది. ప్రైవేట్ పాఠశాలలో చేరే వారి సంఖ్య 202 నుంచి 208కి పెరిగింది. లండన్‌లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ప్రొఫెసర్, లక్నోలోని సిటీ మాంటెస్సొరీ పాఠశాల అధిపతి గీతా కింగ్డన్ గాంధి చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
 
అయితే 20 రాష్ట్రాలలో బడికెళ్లే 11 కోట్ల 30 లక్షల మంది విద్యార్థులలో 65 శాతం మంది ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలకే వెళ్తున్నారు. కాని 14 ఏళ్ల లోపు బాల బాలికలకు ఉచితంగా విద్య నేర్పే ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ క్రమేపీ తగ్గుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునేది ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన వారే. రానురాను ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడానికే మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు ఎక్కువగా ఉన్నా అక్కడ చదువు బాగా చెప్తారని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
 
అందరికీ విద్య కోసం ప్రారంభించిన సర్వ శిక్షా అభియాన్ కోసం 1.16 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా 2009 నుంచి 2014 మధ్య ఈ పాఠశాలలో విద్య నేర్చుకోవడంలో నాణ్యత తగ్గింది. ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ప్రతి అయిదుగురు ఉపాధ్యాయుల్లో ఒకరు కూడా సుశిక్షితులు కారు. సగం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న సగం మంది తాత్కాలిక ఉపాధ్యాయులే. అందువల్ల వీరు శ్రద్ధగా పాఠాలు చెప్పకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బోధనలో నాణ్యతలో తారతమ్యాలు అన్ని రాష్ట్రాలలో ఒకే రకంగా లేవు. 
 
2015-16లో ఉత్తరప్రదేశ్ లోని సగం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే బీహార్‌లో కేవలం నాలుగు శాతం మందే ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. కాని కేరళలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ 2014 లో 40.6 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే 2016లో అది 49.9శాతానికి పెరిగింది. గుజరాత్‌లో కూడా 2014లో 79.2 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే 2016లో అది 86 శాతానికి పెరిగింది. 
 
పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో విద్యార్థులు చదివే పద్ధతి ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఉంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలల్లో కంటే మెరుగ్గా ఉంది. ఫీజు తక్కువగా ఉండే ప్రైవేట్ పాఠశాలలు కొద్దిపాటి మాత్రమే. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 70 నుంచి 85 శాతం మంది పిల్లలు నెలకు రూ. 500 ఫీజు చెల్లంచవలసి వస్తోంది.
 
ప్రభుత్వ పాఠశాలల్లో మూడవ తరగతి చదివే వారిలో కనీసం 25 శాతం మంది రెండో తరగతి పాఠ్యపుస్తకమైనా చదువగలిగే స్థితిలో ఉన్నారు. 2010-11 నుంచి 2015-16 మధ్య ప్రైవేట్ పాఠశాలలు 35 శాతం పెరిగాయి. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న చిన్న పాఠశాలలను, 50 మంది కన్నా తక్కువమంది విద్యార్థులు ఉన్న ఓ మోస్తరు పాఠశాలలను మూసేస్తున్నారు. 2015-16లో 5,044 ప్రభుత్వ పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు గిట్టుబాటు కానందువల్ల అనేక ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో ఈ రకంగా 24,000 ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments